నమస్తే తెలంగాణ
16-04-2023
ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారతదేశం కలిసి సంయుక్తంగా ఉజ్బెకిస్థాన్ రాజధాని తాషెంట్‌లో రెండు రోజుల పాటు హెల్త్ ఫోరమ్-2023 నిర్వహించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఇరు దేశాల దౌత్యవేత్తలతో పాటు భారతదేశ అధికార ప్రతినిధిగా డాక్టర్ దివ్యరాజ్ రెడ్డి సదస్సులో పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారతదేశం కలిసి సంయుక్తంగా ఉజ్బెకిస్థాన్ రాజధాని తాషెంట్‌లో రెండు రోజుల పాటు హెల్త్ ఫోరమ్-2023 నిర్వహించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి, ఇరు దేశాల దౌత్యవేత్తలతో పాటు భారతదేశ అధికార ప్రతినిధిగా డాక్టర్ దివ్యరాజ్ రెడ్డి సదస్సులో పాల్గొన్నారు. ఫోరంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన ఏఐజీ, యశోద, అపోలో, హోలిస్టిక్, రెయిన్‌బో, జీఎస్‌ఎల్‌తో పాటు ఢిల్లీ, ముంబైకి చెందిన మేదాంత, ఫోర్టిస్, సర్వోదయ, ఆకాశ్ వంటి ప్రముఖ హాస్పిటల్స్ ప్రతినిధులతోపాటు హెటిరో, డాక్టర్ రెడ్డీస్, బయోఫెర్న్ లాంటి ఫార్మా సంస్థలతో ఉజ్బెకిస్థాన్, ఆరోగ్య మంత్రిత్వ 100కు పైగా ఎంవోయూలను కుదుర్చుకున్నాయి. పలు యూనివర్సిటీలు కూడా ఈఎంవోయూలు కుదుర్చుకున్నారు.